: ఈతలో రికార్డు సృష్టించిన 104 ఏళ్ల మహిళ

ఆమె వయసు 104 సంవత్సరాలు. అయితేనేం, 1500 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ పోటీలో పాల్గొని రేస్ పూర్తి చేసింది. ఈ ఘనత సాధించిన తొలి శతాధిక వృద్ధురాలిగా నిలిచింది జపాన్ కు చెందిన మైకో నగోకా. ఒక గంటా పదహారు నిమిషాల వ్యవధిలో ఆమె రేస్ ను ముగించింది. ఈ పోటీలు పశ్చిమ జపాన్ లోని ఎహిమేలో జరుగగా, 100 నుంచి 104 సంవత్సరాల వయసు కేటగిరీలో నగోకా మాత్రమే బరిలో నిలిచింది. తాను మరణించే వరకూ ఇలా ఈత కొట్టాలని భావిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. ఆమె సృష్టించిన రికార్డును గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తిస్తుందని భావిస్తున్నట్టు పోటీల నిర్వాహకులు తెలిపారు. కాగా, నగోకా తన 99వ ఏట కూడా 1500 మీటర్ల పోటీలో పాల్గొంది. జపాన్ లో గత సంవత్సరం సెప్టెంబర్ నాటికి 59 వేల మందికిపైగా శతాధిక వృద్ధులు ఉన్నట్టు సమాచారం.

More Telugu News