: రాహుల్ గాంధీపై బెంగపెట్టుకోవద్దు...నాయకత్వం వహిస్తారు: సల్మాన్ ఖుర్షీద్

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కొన్ని రాజకీయ పక్షాలు బెంగపెట్టుకుంటున్నాయని, ఆయన ఎక్కడున్నారని ఆందోళన చెందుతున్నాయని, అది అవసరం లేదని ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తారని స్పష్టం చేశారు. రాహుల్ ఎక్కడున్న విషయం కంటే ఉత్తరప్రదేశ్ లో అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడం ముఖ్యమని ఆయన సూచించారు. సమాజ్ వాదీ పార్టీ నేతలు దానిపై దృష్టిపెడితే బాగుంటుందని ఆయన హితవు పలికారు.

More Telugu News