: చిరంజీవి అభిమాని సంఘం నేతలు కొట్టుకున్నారు
చిరంజీవి అభిమాన సంఘం నేతల మధ్య విభేదాలు కొట్లాటకు దారితీసిన ఘటన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలంలోని వెంకట్రావుపల్లిలో చోటు చేసుకుంది. చిరంజీవి అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఇంట్లో జరిగిన ఒక కార్యక్రమానికి చిరంజీవి అభిమాన సంఘం రెండు రాష్ట్రాల అధ్యక్షులు కరాటే ప్రభాకర్, స్వామినాయుడు ఇతర నేతలు హాజరయ్యారు. వేడుక అనంతరం నాయకులంతా తిరుగు ప్రయాణమయ్యారు. గతంలో ఉన్న విభేదాల కారణంగా, గ్రామం దాటుతుండగా, సమీపంలోని రైల్వేగేట్ సమీపంలో గోదావరిఖనికి చెందిన చిరు అభిమాన సంఘం నేత రాము, అతని అనుచరులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కరాటే ప్రభాకర్ పై దాడికి దిగారు. దీంతో, ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై అభిమాన సంఘం నేతలు సినీ నటుడు చిరంజీవికి కూడా సమాచారం అందించారు.