: మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు... ‘రాయల్స్’ ఆటగాళ్లకు ద్రవిడ్ వార్నింగ్

మ్యాచ్ ఫిక్సింగ్ ను ఎంతమాత్రం సహించబోమని, క్రికెట్ ను మసకబార్చే సదరు చర్యలకు పాల్పడే ఆటగాళ్లపై కఠిన చర్యలు తప్పవని టీమిండియా మాజీ సభ్యుడు, ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పర్యవేక్షకుడు రాహుల్ ద్రవిడ్ హెచ్చరించాడు. మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నీని పురస్కరించుకుని అతడు నిన్న ఈ వ్యాఖ్యలు చేశాడు. గత సీజన్లలో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణాల నేపథ్యంలో అతడు ఈ మేరకు ఘాటుగా స్పందించాడు. ఫిక్సింగ్ కుంభకోణాలు జరగకుండా అన్ని జట్ల యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలని అతడు పిలుపునిచ్చాడు.

More Telugu News