: మూడో ముష్కరుడి కోసం సోదాలు ముమ్మరం... అర్వపల్లిని చుట్టుముట్టిన పోలీసులు

సూర్యాపేట షూటర్స్ ఎన్ కౌంటర్ అనంతరం పోలీసులు ఏమాత్రం విశ్రమించలేదు. జానకీపురంలో హతమైన ఇద్దరు సిమి తీవ్రవాదుల వద్ద లభించిన రైలు టికెట్ ఆధారంగా మూడో ముష్కరుడు కూడా ఉన్నాడని భావిస్తున్న పోలీసులు, నిన్నటి నుంచి నల్గొండ జిల్లా అర్వపల్లి సమీపంలో ముమ్మర సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అర్వపల్లి సమీపంలోని దర్గా ముతావలి మౌలానాను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు, అతడి పోన్ కాల్ డేటాను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిన్నటి ఎన్ కౌంటర్ లో లభించిన వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అందించి, ఆ సంస్థ సహకారం కూడా తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల సోదాలతో అర్వపల్లిలో ఇంకా భయానక వాతావరణమే నెలకొంది.

More Telugu News