: భారతీయులను కాపాడిన పాక్... యెమెన్ నుంచి 11 మందిని తీసుకొస్తున్నామని ప్రకటన

వినడానికి వింతగా ఉన్నా, సాక్షాత్తు పాకిస్థాన్ ప్రభుత్వమే ప్రకటించిన తర్వాత నమ్మి తీరాల్సిందేగా. యెమెన్ లో చిక్కుకున్న తమ దేశస్థులతో పాటు 11 మంది భారతీయులను కూడా రక్షించి తీసుకొస్తున్నట్లు పాక్ ప్రకటించింది. యెమెన్ నుంచి తమవారితో పాటు భారతీయులను తీసుకొస్తున్న తమ నౌక ఈ నెల 7న కరాచీ చేరుకోనుందని కూడా పాక్ తెలిపింది. యెమెన్ లో ఆల్ ఖైదా హస్తగతంలో ఉన్న మొకల్లా నగరంలో చిక్కుబడ్డ 148 మంది పాకిస్థానీలతో పాటు వివిధ దేశాలకు చెందిన 35 మందికి పాక్ తమ నౌకలో ఆశ్రయం కల్పించింది. సదరు 35 మంది విదేశీయుల్లో 11 మంది భారతీయులున్నారు.

More Telugu News