: సైజ్ జీరో మోడళ్లకు షాకిచ్చిన ఫ్రాన్స్
సైజ్ జీరో మోడళ్లకు ఫ్రాన్స్ ప్రభుత్వం షాకిచ్చింది. ఫ్రాన్స్ లోని పారిస్ పేరు చెబితే సూపర్ మోడళ్ల క్యాట్ వాక్ లు గుర్తొస్తాయి. పారిస్ మోడల్ రంగానికి కేంద్రం. మోడలింగ్ లో రాణించాలనుకునే వారంతా చేరే చోటు పారిస్. పారిస్ లో మోడలింగ్ ఏజెన్సీలు ప్రపంచ ఫ్యాషన్ రంగాన్ని శాసిస్తున్నాయి. అలాంటి ఫ్రాన్స్ లో ప్రభుత్వం సైజ్ జీరోను నిషేధించింది. బాడీ మాస్ ఇండెక్స్ 18 కంటే ఎక్కువ ఉన్న అమ్మాయిలకే ఫ్యాషన్ రంగంలో ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఫ్రాన్స్ మోడలింగ్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. కేవలం అందంగా కనిపించాలనే భ్రమలో, సైజ్ జీరో కు ప్రాధాన్యమిస్తూ మోడల్స్ కడుపు మాడ్చుకుని ఆకలితో మరణిస్తున్నారని ఫ్రాన్స్ ప్రభుత్వం పేర్కొంటోంది. గతంలో చోటుచేసుకున్న ఘటనలు మోడలింగ్ రంగంలో పునరావృతం కారాదని భావించిన ఫ్రాన్స్ తాజా నిర్ణయం తీసుకుంది. ఫ్రాన్స్ నిర్ణయంతో మోడలింగ్ రంగం విభేదిస్తున్నప్పటికీ, పౌష్టికాహార విభాగం మాత్రం సంతృప్తిని వ్యక్తం చేస్తోంది.