: వాళ్లిద్దరి వెనుక అలాంటిలాంటి నేరచరిత్ర లేదు... కావాలంటే చూడండి!

నల్గొండ జిల్లాలో ఎన్ కౌంటర్ లో మృతి చెందిన దుండగులిద్దరూ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)కు చెందిన ఉగ్రవాది అబూ ఫైజల్ గ్యాంగ్ లో కీలక సభ్యులని పోలీసులు అనుమానిస్తున్నారు. అస్లాం, జాకీర్ హుస్సేన్ లుగా గుర్తించిన పోలీసుల ముందు కళ్లు చేదిరే నేరచరిత్ర దర్శనమిస్తోంది. మధ్యప్రదేశ్ ఖండ్వా జైలు నుంచి పరారైన వీరిద్దరూ ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నారు. 2007లో కేరళలో ఉగ్రవాద సాయుధ శిబిరం నిర్వహించింది వీరే. ఖాండ్వా పోలీస్ స్టేషన్ లో 2009, 10లో కేసులు నమోదయ్యాయి. 2010లో భోపాల్ లోని ఓ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో చోరీ చేశారు. మహారాష్ట్ర, తమిళనాడు బాంబు పేలుళ్లతో వీరికి సంబంధముంది. 2013లో నరేంద్ర మోదీ ర్యాలీలో బాంబు పేల్చింది వీరి ముఠానే. 2014 అక్టోబర్ లో కరీంనగర్ లోని చొప్పదండి ఎస్బీఐలో చోరీకి పాల్పడింది ఈ ముఠాసభ్యులేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దీనిని ఇంకా ధ్రువపరచలేదు.

More Telugu News