: ఆపరేషన్ జరుగుతుంటే లైవ్ ట్వీట్లు ఇస్తున్న బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్


భుజానికి శస్త్ర చికిత్స నిర్వహిస్తుంటే అందరూ మత్తులో ఉంటారు. కానీ, బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ మాత్రం ట్విట్టర్ వేదికగా, తనకు జరుగుతున్న ఆపరేషన్ వివరాలు వరుసగా అభిమానులతో పంచుకుంటున్నాడు. గతకొంత కాలంగా భుజం గాయంతో బాధపడుతున్న ఆయనకు ఈ ఉదయం శస్త్ర చికిత్స మొదలైంది. ఆపరేషన్ టేబుల్ పై ఉన్న తన సెల్ఫీని పోస్ట్ చేసిన ఆయన తన మెడ వద్ద ఇంజక్షన్ చేశారని ట్వీట్ చేశాడు. ఆయన ఆపరేషన్ 'లైవ్' ను వందలాది మంది అభిమానులు ఫాలో అవుతున్నారు.

  • Loading...

More Telugu News