: అమెరికాలోని సరస్సులో శవమై తేలిన నరసరావుపేట అమ్మాయి

అమెరికాలో తెలుగు అమ్మాయి మరణించిన ఘటన చోటుచేసుకుంది. ప్రాణాలు కోల్పోయిన యువతి పేరు అబ్బూరి లావణ్య (27) కాగా, ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నరసరావుపేట. ఆమె మరణవార్త విన్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. లావణ్య అలబామాలోని ఏ అండ్ ఎమ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్ డీ కింద ప్లాంట్ అండ్ సాయిల్ సైన్స్ అభ్యసిస్తోంది. వాకర్ లేన్ లోని హేజెల్ గ్రీన్ సరస్సులో ఆమె మృతదేహాన్ని అక్కడి మెయింటెనెన్స్ సిబ్బంది బుధవారం ఉదయం కనుగొన్నారు. దీంతో, విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై మ్యాడిసన్ కౌంటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సహచర విద్యార్థిని మృతితో ఏ అండ్ ఎమ్ వర్శిటీలో విషాదఛాయలు అలముకున్నాయి. లావణ్య మరణం పట్ల వర్శిటీ అధ్యక్షుడు ఆండ్రూ హూగిన్ సంతాపం వ్యక్తం చేశారు. కాగా, ఘటనా సమయంలో అసలేంజరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

More Telugu News