: భర్త, అత్తమామలకు మూత్రం కలిపిన టీ ఇచ్చిన ప్రబుద్ధురాలు
మూఢనమ్మకాలు మనుషుల ఆలోచనల్ని ఎంత ప్రభావితం చేస్తాయో తెలిపే ఘటన ఇండోర్ లో చోటుచేసుకుంది. అతీత శక్తులు వస్తాయనే నమ్మకంతో రేఖా నాగవంశీ అనే మహిళ మూత్రం కలిపిన టీ తాగమని భర్త, అత్తమామలను బలవంతం చేసేది. శక్తి అమ్మవారిని భక్తితో కొలిచే ఆమె, పూజలు చేయాలని భర్తను డిమాండ్ చేసేదట. నిరంతరం పాదసేవ చేయాలని భర్తను వేధించేదట. ఆమె విపరీతధోరణిని తట్టుకోలేక వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితురాలి సోదరుడు పోలీస్ అధికారిగా పనిచేస్తుండడంతో వారు ఫిర్యాదును తిరస్కరించేవారట. దీంతో, వారు మహిళాశిశు సంక్షేమ శాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు, వారి ఆరోపణలు వాస్తవమని తేలుస్తూ నివేదిక ఇచ్చారు.