: ప్రభుత్వాన్ని మెచ్చుకున్న జగన్

అనుక్షణం ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడే ప్రతిపక్షనేత జగన్ తొలిసారి ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. ఈ రోజు కడపజిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి రథోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, పలువురు వైకాపా ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జగన్ కు స్వాగతం పలికారు. కోదండరాముడిని దర్శించుకున్న అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం శుభపరిణామం అని అన్నారు. రానున్న రోజుల్లో తిరుమల స్థాయికి ఒంటిమిట్ట ఎదగాలని ఆశిస్తున్నానని అభిలషించారు.

More Telugu News