: ఏపీకి ప్రత్యేక హోదా తప్పక వస్తుంది: ఎంపీ రామ్మోహన్

ఆంధ్రప్రదేశ్ కు తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుందని ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని ఐదు మండలాల కార్యకర్తలతో ఎంపీ సమావేశమై మాట్లాడారు. ఈ సందర్భంగానే రామ్మోహన్ ప్రత్యేక హోదాపై స్పందించారు. ఈ అంశంపై కొన్ని రోజులుగా తీవ్ర అభిప్రాయాలు వెలువడుతున్నప్పటికీ ఏపీ టీడీపీ నేతలు మాత్రం ఆశాభావంతో ఉన్నారు. వెనక్కు తగ్గే ప్రసక్తేలేదని, కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెస్తామని ఏపీ ప్రభుత్వం అంటోంది. అయితే, హోదా ఇవ్వాలని తమకున్నప్పటికీ... కొన్ని ఇబ్బందుల వల్ల, ఇతర రాష్ట్రాల వల్ల ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్న సంగతి తెలిసిందే.

More Telugu News