: ‘సూర్యాపేట’ పరిహారంపై హోం మంత్రి, డీజీపీ విరుద్ధ ప్రకటనలు!

సూర్యాపేటలో దోపిడీ దొంగల కాల్పుల్లో అసువులు బాసిన కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేశ్ ల కుటుంబాలకు సర్కారు నుంచి అందనున్న పరిహారంపై గందరగోళం నెలకొంది. చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.40 లక్షలు, హోంగార్డు కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఈ ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సూర్యాపేటలోని ఘటనా స్థలాన్ని పరిశీలించిన తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, పరిహారంపై మంత్రి ప్రకటనకు విరుద్ధ ప్రకటన చేశారు. కానిస్టేబుల్ లింగయ్య కుటుంబానికి రూ.25 లక్షలు, హోంగార్డు మహేశ్ కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించిన అనురాగ్ శర్మ, వారి కుటుంబాల్లో ఒకరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని తెలిపారు. నిబంధనల మేరకు ఇతర ప్రయోజనాలను కూడా బాధిత కుటుంబాలకు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

More Telugu News