: ఆపరేషన్ 'రాహత్' కోసం నాలుగునౌకలు

ఆపరేషన్ 'రాహత్' కోసం భారతీయ నౌకలు యెమెన్ తీరానికి బయల్దేరాయి. యెమెన్ లో అంతర్యుద్ధం కారణంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో, భారత్ హై ఎలర్ట్ ప్రకటించింది. యెమెన్ లో ఉంటున్న భారతీయులంతా తక్షణం స్వదేశం రావాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో, భారతీయులు స్వదేశానికి తరలేందుకు ఓ నౌకను మొన్న భారతదేశం యెమెన్ కు పంపింది. అది 349 మందిని తీసుకు వస్తోంది. 'ఆపరేషన్ రాహత్' కోసం మరో నాలుగు నౌకలను భారత్ పంపింది. నౌకల్లో రెండు ప్రయాణికులను తీసుకురానుండగా, మరో రెండు యుద్ధనౌకలు వీటికి గస్తీ కాయనున్నాయి. అత్యవసర పరిస్థితి ఎదురైతే ఎదుర్కొనేందుకు రెండు టి-17 యుద్ధ విమానాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిద్ధం చేసింది. కాగా, సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు తిరుగుబాటుదారులపై విరుచుకుపడుతున్నాయి. రెబల్స్ స్థావరాలను, ఆయుధ నిల్వ కేంద్రాలను సంకీర్ణ బలగాలు తుదముట్టించాయి.

More Telugu News