: ప్రజలకు నైతిక విద్య అవసరం: ఆర్ఎస్ఎస్ చీఫ్
ప్రస్తుత సమాజంలో మెరుగైన జీవనానికి నైతిక విద్య ఎంతగానో దోహదపడుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. నైతిక విద్యా వ్యాప్తికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఏంతో కొంత వెనకేసుకున్న తర్వాత ప్రజలు స్వార్థపరుల్లా తయారవుతున్నారని విమర్శించారు. కాలక్రమంలో, వారికీ జంతువులకు తేడా లేదన్న విషయం తెలుస్తుందని వివరించారు. విద్య అనేది ప్రతి మనిషిని మెరుగైన వ్యక్తిగా మార్చుతుందని, అప్పుడా వ్యక్తి ఇతరులకు సాయం చేయడం, మెరుగైన సమాజాన్ని నిర్మించడం లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు. బీహార్లోని కిషన్ గంజ్ లో ఓ కార్యక్రమంలో ఆయన పైవిధంగా పేర్కొన్నారు. వ్యక్తిగతంగా కాకుండా, సంఘటితంగా ఎదిగేందుకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు.