: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రంభ

అందాల తార రంభ మరోసారి తల్లి అయింది. కెనడాలోని టొరంటో సిటీలో ఓ ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు రంభ కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే రంభకు మూడేళ్ల వయసున్న కూతురు ఉంది. సినీ రంగంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడే కెనడాలో సెటిల్ అయిన పారిశ్రామికవేత్త ఇందిరన్ ను రంభ వివాహం చేసుకుంది. ప్రస్తుతం, టీవీలో ప్రసారమవుతున్న కొన్ని టాలెంట్ షోలలో ఆమె జడ్జ్ గా వ్యవహరిస్తోంది.

More Telugu News