: జైట్లీకి అన్ని విషయాలు వివరించా... ఆయన సావధానంగా విన్నారు: జగన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ వెంట వైసీపీ ఎంపీలు కూడా ఉన్నారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. అన్ని రకాలుగా వెనుకబడిన ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని, అవసరమైన మేరకు నిధులు మంజూరు చేయాలని జైట్లీని కోరినట్టు తెలిపారు. అదేవిధంగా, జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించేందుకు సహకరించాలని కోరామన్నారు. అలాగే, రాజధాని నిర్మాణంపై కూడా చర్చించామని తెలిపారు. పట్టిసీమ నిర్మాణంతో పోలవరం కోల్డ్ స్టోరేజీలోకి వెళతుందని జైట్లీకి తెలిపానని... అన్ని విషయాలను ఆయన సావధానంగా విన్నారని చెప్పారు.

More Telugu News