: నవ్యాంధ్ర తాత్కాలిక రాజధాని అమరావతిలోనే... సింగపూర్ నుంచి రాగానే చంద్రబాబు నిర్ణయం

నవ్యాంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానిని అమరావతిలో నిర్మించాలని ఏపీ సర్కారు దాదాపుగా నిర్ణయం తీసుకుంది. సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే రేపు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇదివరకు ఏపీ తాత్కాలిక రాజధానిని మంగళగిరిలో నిర్మించాలని సర్కారు భావించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్న చంద్రబాబు అమరావతి వైపు మొగ్గు చూపుతున్నారు. అమరావతిలో తాత్కాలిక రాజధాని నిర్మాణంలో భాగంగా ఫ్యాబ్రికేటెడ్ భవనాలను ఏడాదిలోగా నిర్మించడంతో పాటు రెండేళ్లలో ఉద్యోగులకు కూడా తాత్కాలిక రాజధానికి తరలించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాక ప్రభుత్వ ముఖ్య భవనాలన్నింటినీ అమరావతిలోనే నిర్మించాలని కూడా చంద్రబాబు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ విషయంలో రేపు కీలక నిర్ణయాలు వెలువడనున్నట్లు ప్రచారం సాగుతోంది.

More Telugu News