: ఏపీ రాజధానికి రూ.1500 కోట్ల నిధులు ప్రకటించిన కేంద్రం

విభజన అనంతరం కష్టాల్లో పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాస్తంత ఊరట. ఏపీ రాజధాని కోసం కేంద్రం రూ.1500 కోట్ల ప్రత్యేక సాయం ప్రకటించింది. అసెంబ్లీ, రాజ్ భవన్, సచివాలయం, హైకోర్టు నిర్మించేందుకు రూ.500 కోట్లు, రాజధానిలో మౌలిక వసతుల కోసం రూ.1000 కోట్లు అందిస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. విభజన చట్టంలోని 94 (3) సెక్షన్ కింద నిధులు కేటాయించారు. కాగా, వేల కోట్ల ఖర్చుతో రాజధాని నిర్మించాలని ఏపీ సర్కారు భావిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు మాస్టర్ ప్లాన్ కూడా తయారుచేయిస్తున్నారు.

More Telugu News