: హైదరాబాదులో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దారుణ హత్య

హైదరాబాదులో మరో ఘోరం సంభవించింది. నగర నడిబొడ్డున ఉన్న సోమాజిగూడలోని ఓ అపార్ట్ మెంటులో నాలుగో అంతస్తులో నివసిస్తున్న మహిళ దారుణ హత్యకు గురైంది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హత్యకు గురైన మహిళ పేరు అనూష అని... ఆమె సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోందని గుర్తించారు. కొద్ది రోజుల క్రితమే అనూషకు వివాహం అయింది. కేసు నమోదు చేసిన పోలీసులు... ఈ హత్య ఎవరు చేసుంటారు? ఎందుకు చేసుంటారు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News