: ఇక తెలంగాణలోనూ నిరంతర విద్యుత్... నేడు హైదరాబాదు రానున్న కేంద్ర బృందం


రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ కొరతతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విభజన వెంటనే తలెత్తిన విద్యుత్ కోతలతో కేసీఆర్ సర్కారు కూడా సంకట స్థితిని ఎదుర్కొంది. మరోవైపు రాష్ట్ర విభజన జరిగిన వెంటనే ఏపీలో నిరంతర విద్యుత్ సరఫరాకు కేంద్రం శ్రీకారం చుట్టడం కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఒకింత ఒత్తిడికి గురి చేసిందనే చెప్పాలి. అయితే తెలంగాణలోనూ నిరంతర విద్యుత్ కు కసరత్తు మొదలైంది. దక్షిణాది గ్రిడ్ సహకారంతో తెలంగాణలోనూ నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ఉన్నతాధికారుల బృందం నేడు హైదరాబాదు వస్తోంది. రాష్ట్ర అధికారులతో చర్చలు జరిపే కేంద్ర బృందం... నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యాసాధ్యాలు, అవసరమైన ఏర్పాట్లు తదితరాలపై సమాలోచనలు చేయనుంది.

  • Loading...

More Telugu News