: రేపు ఢిల్లీకి జగన్... ఏపీ సమస్యలపై ప్రధానితో భేటీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళుతున్నారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు పార్టీ ఎంపీలతో వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావల్సిన నిధులు వంటి పలు అంశాలపై మోదీకి వివరిస్తారు. అంతేగాక విభజన సమయంలో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ అంశాలపైన కూడా ప్రధానితో చర్చిస్తారు. మరోవైపు విశాఖ బాణాసంచా పేలుడు ఘటనలో చనిపోయిన వారికి జగన్ సంతాపం తెలిపారు. బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని, గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.