: ఇల్లియాట్ హాఫ్ సెంచరీ... 100 దాటిన న్యూజిలాండ్ స్కోర్


39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ న్యూజిలాండ్ జట్టును గట్టున పడేసే బాధ్యతను మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు టేలర్, ఇల్లియాట్ లు భుజాన వేసుకున్నారు. వీరిద్దరూ నెమ్మదిగా ఆడుతూ క్రీజులో నిలదొక్కుకొని స్కోర్ ను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో ఇల్లియాట్ తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 26.2 ఓవర్లలో 100 పరుగుల మైలురాయిని దాటించారు. తొలి 50 పరుగులను 93 బంతుల్లో, ఆపై 50 పరుగులను 65 బంతుల్లో న్యూజిలాండ్ జట్టు సాధించింది. ప్రస్తుతం టేలర్ 29, ఇల్లియాట్ 50 పరుగుల వద్ద కొనసాగుతున్నారు. న్యూజిలాండ్ స్కోర్ 28 ఓవర్లలో 115 పరుగులు.

  • Loading...

More Telugu News