: మొదలైన ‘మా’ పోరు... ఓటేసిన సినీ ప్రముఖులు

తెలుగు చిత్ర పరిశ్రమ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ఈ ఉదయం ప్రారంభం అయ్యాయి. అధ్యక్ష బరిలో ప్రముఖ సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, జయసుధ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఓటు వేసేందుకు పలువురు సినీ ప్రముఖులు హైదరాబాదు, ఫిలించాంబర్ కార్యాలయానికి తరలి వచ్చారు. 'మా' అధ్యక్షుడు మురళీ మోహన్, ఆయన బలపరిచిన జయసుధ ఉదయం 7:30 గంటలకే ఓటింగ్ జరిగే చోటకు వచ్చారు. కాగా, ఓటింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకూ జరగనుంది. ‘మా’లో ప్రస్తుతం సుమారు 700 మందికి పైగా సభ్యత్వం కలిగి ఉండగా, 400 నుంచి 500 మంది వరకూ ఓటేసే అవకాశాలు ఉన్నాయి. కోర్టు ఆదేశాల దృష్ట్యా ఫలితాలు ఇప్పట్లో వెలువడే పరిస్థితి లేదు.

More Telugu News