: ఆమ్ ఆద్మీ పార్టీలో మరో వికెట్ పడింది!


ఢిల్లీలో మళ్లీ పీఠం ఎక్కిన ఆనందం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లో మచ్చుకైనా కనిపించడంలేదు. పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో, పలువురిని పార్టీ సస్పెండ్ చేయగా, ఇంకొందరు పార్టీని వీడిపోతున్నారు. తాజాగా, ప్రముఖ సామాజికవేత్త మేధా పాట్కర్ కూడా ఆప్ కు గుడ్ బై చెప్పారు. శనివారం నాడు తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించారు. పార్టీ వ్యవహారం అంతా ఫన్నీగా మారిందని విమర్శించారు. పార్టీ రాజకీయపరమైన సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చారని ఆరోపించారు. కాగా, సీనియర్ నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లపై ఆప్ అధినాయకత్వం బహిష్కరణ వేటు వేయడం తెలిసిందే.

  • Loading...

More Telugu News