: మైత్రిపాల సిరిసేన సోదరుడి దారుణ హత్య!

శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సోదరుడు ప్రియాంత సిరిసేన(40) దారుణహత్యకు గురయ్యారు. రెండు రోజుల క్రితం ప్రియాంత సిరిసేనపై ఆయన సొంత నగరమైన పొలొన్నారువలో ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన ప్రియాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. కాగా, ప్రియాంతపై దాడికి దిగిన వ్యక్తి అతని మిత్రుడు కావడం విశేషం. గొడ్డలితో నరికి హత్యకు పాల్పడిన ప్రియాంత సిరిసేన స్నేహితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం అతనికి ఏప్రిల్ 8 వరకు రిమాండ్ విధించింది. కాగా, చైనా పర్యటనలో ఉన్న శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఘటన గురించి తెలుసుకుని షాక్ కు గురయ్యారు.

More Telugu News