: ఫైనల్ కోసం ఆసీస్-కివీస్ తీవ్రమైన సాధన

మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో రేపు జరగనున్న ఫైనల్ కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రపంచకప్ ఫైనల్ చేరుకున్న రెండు జట్లు అంతిమపోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తొలిసారి ఫైనల్ చేరిన న్యూజిలాండ్ తొలిసారి ప్రపంచకప్ ను ముద్దాడేందుకు ఎదురుచూస్తోంది. రికార్డు స్థాయిలో ప్రపంచకప్ లు సాధించిన జట్టుగా నిలిచేందుకు ఆస్ట్రేలియా తహతహలాడుతోంది. రెండు జట్లు ఎవరికి వారు 'విజేతలం మేమే' అంటూ ప్రకటించేసుకుంటున్నాయి. ఎంసీజీ పెద్ద గ్రౌండ్ అని, కివీస్ రికార్డు బాలేదు కనుక విజయం తమదేని ఆసీస్ పేర్కొంటోంది. క్రికెట్ లో ఏదీ అసాధ్యం కాదు. జట్టుగా ఆడడమే న్యూజిలాండ్ విజయరహస్యం. ఆసీస్ ను చిత్తు చేసి తొలి ప్రపంచకప్ ను సగర్వంగా సాధిస్తామని కివీస్ ఆటగాళ్లు తెలిపారు. రెండు అగ్రశ్రేణి జట్లు, ఆతిథ్య జట్లు పోటీ పడుతుండడంతో ఫైనల్ పై ఆసక్తి రేగుతోంది. ఫైనల్లో తలపడేందుకు రెండు జట్లు తీవ్రమైన సాధనలో మునిగిపోయాయి. ప్రణాళికలు ప్రాక్టీస్ లోనే అమలు చేస్తూ, ఫలితాలు అంచనా వేసుకుంటున్నాయి.

More Telugu News