: ఎంత కాలం బతుకుతానో తెలీదు... ఆ అడ్డుగోడ కూల్చే మరణిస్తా: కాదంబరి కిరణ్
50 ఏళ్ల వయసుకు చేరుకున్నానని, ఇంకా ఎంతకాలం బతుకుతానో తెలియదని, చివరికి అంతా గుర్తుంచుకునే పని చేసే వెళ్తానని కేరెక్టర్ ఆర్టిస్టు కాదంబరి కిరణ్ కుమార్ తెలిపాడు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ కు, కృష్ణానగర్ కు మధ్యనున్న అడ్డుగోడను కూల్చేస్తానని, 'మా' అంటే సినీ నటులందరిదీ అనే భరోసా కల్పించేందుకు ఏం చేయాలో అంతా చేస్తానని అన్నాడు. తన కెరీర్ పై ఇది తీవ్రప్రభావం చూపే ప్రమాదం ఉందని శ్రేయోభిలాషులు హెచ్చరించారని, భయపెట్టారని అయినప్పటికీ ఓ అడుగు వేశాక వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని కాదంబరి స్పష్టం చేశాడు. ఎంతకాలం ఎలా బతుకుతామో తెలియదని, సినీ కళాకారుల కష్టాలు తీర్చేందుకు ఇదో అవకాశం అని కిరణ్ అన్నాడు.