: పులుల సంరక్షణలో విదేశాలకు శిక్షణనిచ్చేందుకు రెడీ: ప్రకాశ్ జవదేకర్
ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న పులుల సంరక్షణ కోసం తాము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. తెలంగాణలోని దూలపల్లిలో ఉన్న పులుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పులుల సంరక్షణకు విదేశాలు సాయం కోరితే శిక్షణ ఇవ్వగల సామర్థ్యం ఉందని అన్నారు. పులుల సంరక్షణకు అవసరమైన అన్ని రకాల సామర్థ్యాలు భారతదేశం కలిగి ఉందని ఆయన చెప్పారు. పులులను దత్తత కోరితే ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.