: స్టేట్ మెంట్ సమయంలో మీడియాను నిషేధించాలన్న సల్మాన్ అభ్యర్ధన తిరస్కరణ

2002 హిట్ అండ్ రన్ కేసు విచారణ సందర్భంగా తన స్టేట్ మెంట్ రికార్డు చేసే సమయంలో మీడియాను అనుమతించరాదంటూ నటుడు సల్మాన్ ఖాన్ చేసిన అభ్యర్థనను సెషన్స్ కోర్టు తిరస్కరించింది. ఈ మేరకు జడ్జి డీడబ్ల్యూ దేశ్ పాండే, సల్మాన్ పిటిషన్ ను కొట్టివేశారు. అయితే, సల్మాన్ స్టేట్ మెంట్ మొత్తం రికార్డు చేయడం పూర్తైన తరువాతే వార్తను నివేదించాలని జడ్జి మీడియాను ఆదేశించారు. ఈ కేసులో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన సల్మాన్ బోనులో నిలబడి తన సాక్ష్యాన్ని వినిపించారు.

More Telugu News