: మురళీ మోహన్, అలీ, ఇతర ప్రతినిధులకు కోర్టు నోటీసులు
'మా' ఎన్నికలు సస్పెన్స్ సినిమాను తలపిస్తున్నాయి. 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' ఎన్నికల చిత్రం మహారంజుగా సాగుతోంది. సినీ నటులంతా సేవ చేస్తామంటూ ముందుకు వస్తూ, మేమంటే మేమంటూ ఆత్రుత ప్రదర్శిస్తున్నారు. రెండు వర్గాలుగా ఏర్పడిన 'మా' ప్రతినిధులు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ సినీ రంగాన్ని, రాజకీయ రణరంగంగా మార్చారు. వ్యక్తిగత ప్రతిష్ఠకు పోయి, ఇంటిగుట్టు వీధిన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో 'మా' ఎన్నికలు నిలిపేయాలంటూ ఓ.కల్యాణ్ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఎంపీ మురళీమోహన్, అలీ, ఇతర ప్రతినిధులకు నోటీసులు జారీ చేసింది.