: ఏప్రిల్ 4న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

స్పీకర్‌పై వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ 4న అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ మేరకు నేటి మధ్యాహ్నం సభాపతి కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన సమావేశమైన బీఏసీ నిర్ణయం తీసుకుంది. అవిశ్వాసంపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. కాగా, వైకాపా ఎమ్మెల్యేలపై టీడీపీ ఇచ్చిన హక్కుల ఉల్లంఘన నోటీసులు ఉపసంహరించుకునే ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వైకాపా సభ్యులు స్పీకర్‌ కోడెలకు క్షమాపణ చెబితే నోటీసులు వెనక్కి తీసుకునే యోచనలో ఉన్నట్లు టీడీపీ నేత ఒకరు తెలిపారు.

More Telugu News