: ఇష్టం లేని రైతుల భూములు వదిలేయాల్సిందే... ఏపీ సర్కారుకు హైకోర్టు ఆదేశం

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూముల విషయంలో రైతులకు ఊరట లభించింది. ఇష్టం లేని రైతుల భూములను సమీకరణ జాబితా నుంచి తొలగించాలని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు సీఆర్డీఏ కమిషనర్ ను ఆదేశించింది. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చేందుకు ఇష్టం లేని రైతులకు చెందిన భూములను వదిలేయాల్సిందేనని హైకోర్టు ఏపీ సర్కారుకు తేల్చిచెప్పింది. అంతేకాక అలా ఇష్టం లేని రైతులెంతమంది ఉన్నారు? వారికి సంబంధించిన భూములు ఎంత మేర ఉన్నాయి? వాటిని వదిలిపెట్టారా? లేదా? అన్న విషయాలతో కూడిన సమగ్ర నివేదికను 15 రోజుల్లోగా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. తమకిష్టం లేకున్నా రాజధాని నిర్మాణం పేరిట ప్రభుత్వం తమ భూములను లాక్కుంటోందని ఆరోపిస్తూ తుళ్లూరు ప్రాంతానికి చెందిన 35 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ పరిశీలించిన కోర్టు వారికి అనుకూలంగా తీర్పు చెప్పింది.

More Telugu News