: ఎమ్మెల్యేతో బూట్లు తొడిగించుకున్న లాలు... హల్ చల్ చేస్తున్న వీడియో
సొంత పార్టీ ఎమ్మెల్యే అన్వర్ అహ్మద్ తో ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ బూట్లు తొడిగించుకుంటున్న దృశ్యాలు టీవీ ఛానళ్ళు, సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. తూర్పు చంపారన్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో లాలు పక్కనే ఉన్న అన్వర్ కిందకు వంగి బూట్లు తొడుగుతున్న దృశ్యాలు ఓ ప్రైవేటు ఛానెల్ లో ప్రసారమయ్యాయి. దీంతో లాలూపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్వయంగా లాలూ రంగంలోకి దిగి, తనకు బూట్లు తొడగలేదని, బూటు తాడును మాత్రమే ముడివేశారని వివరణ ఇచ్చారు.