: 'అర్హత లేని వ్యక్తికి సన్మానమా?' అనడిగిన చరిత్రకారుడికి ముఖ్యమంత్రి సాక్షిగా దేహశుద్ధి

ముఖ్యమంత్రి సాక్షిగా ఓ సభలో 81 ఏళ్ల చరిత్రకారుడిపై దాడి జరిగింది. బెంగళూరులోని విధానసౌధలో వచనకారుడు, శివ భక్తుడిగా పేరొందిన దివంగత దేవర దశిమయ్య జయంతి వేడుకల్ని కర్ణాటక ప్రభుత్వం నిర్వహించింది. కార్యక్రమం ప్రారంభం అవుతుండగా, దేవర దశిరామయ్య వచనాలే రాయలేదని, జేదార దశిరామయ్యే వచనాలు రాశాడని, పేర్లను గుర్తించడంలో కర్ణాటక ప్రభుత్వం పొరపాటు పడిందని పేర్కొంటూ, చరిత్రకారుడు, రచయిత ఎం.చిదానందమూర్తి కరపత్రాలు పంపిణీ చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై ఆగ్రహించిన కొందరు వ్యక్తులు ఆయనపై దాడికి దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చరిత్రకారుడు, అతని శిష్యగణాన్ని బయటికి పంపారు. దీంతో వివాదం సర్దుమణిగింది. ఈ తతంగమంతా సీఎం సిద్దరామయ్య సమక్షంలోనే జరగడం విశేషం.

More Telugu News