: మిలియన్ డాలర్లతో మరో 'మక్కా' తయారైంది
మరో 'మక్కా'నా ఎక్కడ, ఎవరు, ఎందుకు నిర్మిస్తున్నారనే అనుమానం వచ్చిందా? ముస్లిం మత ప్రవక్త 'మహమ్మద్' బాల్య విశేషాలతో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. దాని కోసం 'మక్కా'ను పోలిన మరో నగరాన్ని భారీ సెట్టింగులతో ఏర్పాటు చేశారు. 'మహమ్మద్, మెసెంజర్ ఆఫ్ గాడ్' పేరిట రూపొందనున్న ఈ సినిమాను ఇరాన్ కు చెందిన ఓ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించనుంది. 'మహమ్మద్' ప్రవక్త బాల్యం, ఎక్కడ, ఎలా గడిచింది? అనే విశేషాలు చిత్రీకరించేందుకు, ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల గ్రామమైన అల్లాహ్ యార్ లో మక్కా నమూనాలో భారీ సెట్టింగ్ వేశారు. మిలియన్ డాలర్లు ఖర్చుచేసి మక్కా నమూనాను నిర్మించడం విశేషం.