: 30 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన పాక్ సైన్యం
మన దేశంలోకి ఉగ్రవాదులను పంపుతున్న పాకిస్థాన్... అదే సమయంలో అంతర్గత ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోంది. ఈరోజు పాక్ వాయవ్య ప్రాంతంలోని ఖైబర్ ప్రావిన్స్ లో ఉన్న తీవ్రవాద స్థావరాలపై ఆ దేశ వైమానిక దళాలు దాడులు జరిపాయి. ఈ దాడుల్లో కనీసం 30 మంది ఉగ్రవాదులు హతమయినట్టు అధికారిక సమాచారం వెలువడింది. మృతి చెందిన వారిలో కీలక కమాండర్లతో పాటు, ఇతర దేశాలకు చెందిన ఉగ్రవాదులు కూడా ఉన్నట్టు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ప్రకటించింది.