: ఎంపీపీఈబీ స్కాంలో నిందితుడు, మధ్యప్రదేశ్ గవర్నర్ కుమారుడు మృతి

మధ్యప్రదేశ్ గవర్నర్ రాం నరేష్ యాదవ్ కుమారుడు శైలేష్ యాదవ్ లక్నోలో మృతి చెందాడు. తమ ఇంటిలోని అతని గదిలో నేలపై శైలేష్ పడి ఉన్నాడని, మెదడులో రక్తస్రావంతో చనిపోయి ఉంటాడని సమాచారం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు (ఎంపీపీఈబీ) స్కాంలో శైలేష్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడు చనిపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. మరోవైపు ఈ స్కాంలో ప్రమేయం ఉందంటూ గవర్నర్ పై ఆరోపణలు రావడంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ దర్యాప్తు చేసింది. అవి నిజమని తేలడంతో గవర్నర్ పై కేసు కూడా నమోదైంది.

More Telugu News