: ఇంటర్నెట్ ను కుదిపేస్తున్న ఐదేళ్ల పాప మేకప్ టిప్స్ వీడియో


సాధారణంగా చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు. అలాగే, ప్రతిక్షణం కళ్ల ముందు కదలాడే పెద్దలను అచ్చుగుద్దినట్టు అనుకరించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ, డన్నా గోమెజ్ అనే ఐదేళ్ల కొలంబియా చిచ్చరపిడుగు మేకప్ పై ముఖం తిప్పుకోలేని చిట్కాలు చెబుతోంది. డన్నా గోమెజ్ కొలంబియన్ ప్రైమరీ స్కూల్ లో చదువుతోంది. ఈ ఐదేళ్ల గడుగ్గాయి మేకప్ ఎలా చేసుకోవాలి? ఫౌండేషన్ ఎలా వేసుకోవాలి? మస్కారా, ఐలైనర్ ఎలా వేసుకోవాలి? మేకప్ ఎలా చేసుకుంటే బాగుంటుంది? అంటూ స్పానిష్ భాషలో చెప్పిన చిట్కాలకు ముగ్ధులైన రెండు కోట్ల మంది, సామాజిక వెబ్ సైట్లలో బాలిక మేకప్ పాఠాన్ని ఇష్టపడ్డారట. ఈ వీడియోను కోటీ యాభై లక్షల మంది షేర్ చేసుకోవడం విశేషం. పెద్ద ఆరిందాలా చెబుతున్న మేకప్ పాఠాన్ని బాలిక బంధువు (ఆంటీ) డెనిస్సీ చిత్రీకరించి ఇంటర్నెట్ లో ఆప్ లోడ్ చేసింది. చిన్న బాలిక ముచ్చటగా చెబుతున్న మేకప్ కిటుకులను పెద్దలంతా ఆశ్చర్యపడి చూస్తుండగా, బుద్ధిగా చదువుకోకుండా అప్పుడే ఈ మేకప్ గోల ఏంటి? అంటూ విమర్శించేవారు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News