: మలేసియాలో వేగంగా వ్యాపిస్తున్న ఐఎస్ భావజాలం
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) భావజాలం ఇప్పుడు మలేసియాలో వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే పలువురు మలేసియన్లు ఇరాక్, సిరియా దేశాల్లో ఐఎస్ దళాల పక్షాన పోరాడుతున్నారన్న ఇంటలిజెన్స్ నివేదికల నేపథ్యంలో, సంకీర్ణ ప్రభుత్వ సీనియర్ నేత ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఐఎస్ భావజాలం విస్తరిస్తోందని, అరికట్టాలని అన్నారు. 61 మలేసియా జాతీయులు ఐఎస్ లో చేరగా, వారిలో 10 మంది హతమయ్యారని మలేసియా హోం మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఐఎస్ వేళ్లూనుకోకుండా చేసేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని రవాణా మంత్రి లివో టియాంగ్ లై పిలుపునిచ్చారు. మతపరమైన అతివాదం సమాజాన్ని క్యాన్సర్ లా కబళిస్తోందని అభిప్రాయపడ్డారు.