: అమరవీరుల కోసం ఐక్యరాజ్యసమితి మెమోరియల్ వాల్

వివిధ దేశాల్లో ఐక్యరాజ్యసమితి తరపున శాంతి దళంలో (పీస్ కీపర్స్) పని చేస్తూ పలు దేశాలకు చెందిన ఎందరో సైనికులు విధినిర్వహణలో ప్రాణత్యాగం చేశారు. ఇలా ప్రాణత్యాగం చేసిన వారి స్మృత్యర్ధం ఓ చిహ్నం నిర్మిచాలని భారత్ ఐక్యరాజ్యసమితికి సూచించింది. ప్రపంచంలో ఇంతవరకు పీస్ కీపర్స్ కోసం ఎలాంటి స్మృతి చిహ్నం లేదని ఐక్యరాజ్యసమితికి భారత్ గుర్తుచేసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ఐక్యరాజ్యసమితి జెనీవాలోని ప్రధాన కార్యాలయం వద్ద ఒక గోడను మెమోరియల్ వాల్ గా నిర్మించాలని నిర్ణయించింది.

More Telugu News