: ఎవరో రాసిచ్చిన బడ్జెట్ అది... కాంగ్రెస్ ఎద్దేవా
2015-16 సంవత్సరానికి గాను తెలంగాణ అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి విరుద్ధంగా ఉందని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఎవరో రాసిచ్చిన బడ్జెట్ ను చదివినట్టుగా ఉందే తప్ప భవిష్యత్తుకు మార్గ నిర్దేశం చేసేలా లేదని ఆయన ఎద్దేవా చేశారు. డీకే అరుణను సభలో టీఆర్ఎస్ ఎమ్మెలేలు ఈవ్ టీజింగ్ చేశారని ఆరోపించారు. ఆమెతో క్షమాపణలు చెప్పించినందుకు సభ తలదించుకోవాలన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విపక్ష సభ్యులపై దాడి చేయడం హేయమైన చర్య అని, దీనికి సంబంధించి కెమెరాల ఫుటేజీని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాడి చేస్తుంటే తప్పించుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే బెంచ్ ఎక్కారని భట్టి వివరణ ఇచ్చారు.