: రేపటికి వాయిదాపడ్డ ఏపీ శాసనసభ

ఈ రోజు వాడీవేడిగా కొనసాగిన ఏపీ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. సీఆర్డీఏ బిల్లులో మూడు సవరణలు ప్రతిపాదిస్తూ ప్రభుత్వం సవరణ బిల్లును నేడు సభలో ప్రవేశపెట్టింది. పోలవరం, పట్టిసీమ, నదుల అనుసంధానం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. ఇరు పక్షాల నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. సభను అదుపులో ఉంచడానికి మధ్యమధ్యలో స్పీకర్ కోడెల శివప్రసాద్ పలుమార్లు సభను వాయిదా వేశారు.

More Telugu News