: ఏప్రిల్ 6న చంద్రబాబుకు ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏప్రిల్ 6వ తేదీన ఘన సన్మానం జరగనుంది. ఈ సన్మానాన్ని తిరుపతిలో నిర్వహించాలని ఏపీ ఎన్జీవోల సంఘం నిర్ణయించింది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చినందుకు ఈ సన్మానం చేయనున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిన్న జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు మీడియాకు వివరించారు.

More Telugu News