: రొమ్ము క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి... గిన్నిస్ రికార్డుకెక్కిన అన్నా డీఎంకే

ఒకేరోజు ఏకంగా 2,037 మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి అన్నాడీఎంకే పార్టీ గుర్తింపు దక్కించుకుంది. ఈ సేవతో ఆ పార్టీ గిన్నిస్ రికార్డుల పుస్తకంలో చోటు సంపాదించింది. ఈ నెల 6న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తమిళనాడులో వారం రోజుల పాటు వైద్యశిబిరాల్లో 16వేల మంది మహిళలు పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఆనాడు ఒక్క ధర్మపురి శిబిరంలోనే 2,037 మంది రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నారట. మరోచోట 971 మంది ఈ పరీక్షలు చేయించుకున్న రికార్డు ఉంటే, దాన్ని ఇప్పుడు అన్నా డీఎంకే అధిగమించింది.

More Telugu News