: ప్రపంచంలో పది రొమాంటిక్ రైళ్లివే...!
జీవితం ప్రయాణం లాంటిదని ఎందరో కవులు చెప్పారు... ప్రయాణంలో జీవితం బాగుంటుందని ఆధునిక తరం భావిస్తోంది. చాలా మంది హాబీల్లో ప్రయాణం విధిగా ఉంటోంది. దీంతో రైలు ప్రయాణం, అందులో కాస్త రొమాన్స్ కలిస్తే మరింత అద్భుతంగా ఉంటుందని పాశ్చాత్యులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రొమాంటిక్ రైళ్లపై బ్రిటన్ కు చెందిన ఈస్ట్ కోస్ట్ ట్రైన్ అనే సంస్థ సర్వే చేసింది. సర్వేలో తొలి పది రోమాంటిక్ రైళ్ల వివరాలు వెల్లడించింది.
అందులో డిలైడ్ టూ డార్విన్ ప్రయాణించే ఆస్ట్రేలియా రైలు అగ్రస్థానం సాధించగా, రెండో స్థానంలో కెనడాలో నడిచే యూకాన్ రైలు, అలాగే గ్లాస్గో నుంచి ఫోర్ట్ విలియం వెళ్లే స్కాట్ లాండ్ రైలు మూడో స్థానంలో నిలవగా, నాలుగవ స్థానంలో ఒల్లాంటాయ్ టాంబో నుంచి మచ్చుపిచ్చు వరకు వెళ్లే పెరూ రైలు నిలవగా, ఐదవ స్థానంలో విల్డర్ స్విల్ నుంచి షైనిగే ప్లాట్ రైలు స్టిట్జర్లాండ్ దేశానిది. ప్రిటోరియా నుంచి డర్బన్ వెళ్లే దక్షిణాఫ్రికా రైలు ఆరవస్థానంలో నిలిచింది.
మాస్కో నుంచి వ్లాదివోస్తక్ ప్రయాణించే రష్యా రైలు ఏడవ స్థానంలో నిలిచింది. క్రైస్ట్ చర్చ్ నుంచి గ్రేమౌత్ వెళ్తున్న న్యూజిలాండ్ ట్రైన్ ఎనిమిదవ స్థానంలో ఉంటుంది. జెర్మాట్ నుంచి దావోస్ వెళ్లే స్టిట్జర్లాండ్ రైలు ఎనిమిదవ స్థానంలో ఉంది. కాన్వే సెనిక్ రైల్ రోడ్ మరియు న్యూహ్యాంషేర్ ప్రయాణించే అమెరికా రైళ్లు వరుసగా చివరిస్థానాల్లో నిలుస్తాయి.