: తెలుగుదేశంలోకి దాడి వీరభద్రరావు!... మంత్రి గంటా శ్రీనివాస్ తో భేటీ
మంత్రి గంటా శ్రీనివాస్ తో వైసీపీ మాజీ నేత దాడి వీరభద్రరావు భేటీ అయి చర్చలు జరిపారు. దాడి తెలుగుదేశం పార్టీలో చేరతారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. పార్టీలో తనకు, తన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తే, తెలుగుదేశంలో చేరుతానని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. వీరి భేటీపై మరిన్ని వివరాలు తెలియరానప్పటికీ, సమావేశం అనంతరం ఇరువురూ కలిసి ఒకే కారులో ఎయిర్ పోర్టుకు వెళ్లడం గమనార్హం. అతి త్వరలో దాడి వీరభద్రరావు పచ్చ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.