: కొత్త ఇంట్లో పాలు పొంగించిన మోదీ
శ్రీలంక పర్యటన మరికొన్ని గంటల్లో ముగుస్తుందనగా భారత ప్రధాని ఒక పేదవాడి ఇంటి గృహప్రవేశానికి వెళ్లి పాలు పొంగించారు. అంతర్యుద్ధం కారణంగా కుదేలైన జాఫ్నాలో పర్యటించిన ఆయన ఇళవళైలో భారత ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తున్న గృహసముదాయంలో ఒక కుటుంబం నిర్వహించిన 'గృహప్రవేశం' కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు ఇండియాకు అత్యంత సమీపంలో ఉండే తళైమన్నార్ పట్టణంలో రైల్వే సేవలను మోదీ పునఃప్రారంభించారు. తమ ప్రాంతానికి వచ్చిన మోదీకి తమిళ మహిళలు హారతులతో స్వాగతం పలికారు. జాఫ్నాలోని చారిత్రక నాగుళేశ్వరం ఆలయాన్ని మోదీ సందర్శించారు.