: టీఆర్ఎస్ ది మాటల ప్రభుత్వం... కేంద్రంతో సఖ్యత లేకే నిధులు రావట్లేదు: బీజేపీ నేత మురళీధరరావు

తెలంగాణ ప్రభుత్వం తీరుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు ధ్వజమెత్తారు. కల్లబొల్లి మాటలు చెబుతూ సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం నేడు ఆయన వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంతో టీఆర్ఎస్ సర్కారు స్నేహపూర్వక ధోరణితో వ్యవహరించకపోవడంతోనే రాష్ట్రానికి నిధులు రావట్లేదని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను హైజాక్ చేసిన కేసీఆర్ పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు.

More Telugu News